04 May 2025
కుర్రహీరోయిన్లకు చెమటలు పట్టిస్తోన్న త్రిష.. ఆస్తులు ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ త్రిష పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్.
ఇటీవలే తమిళంలో విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.
ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ కుర్ర హీరోయిన్లకు గుబులు పుట్టి్స్తోంది ఈ ముద్దుగుమ్మ.
త్రిష 1983 మే 4న తమిళనాడులోని మద్రాసులో జన్మించింది. 1999లో మిస్ చెన్నై కిరీటాన్ని గెలిచి సినీరంగంవైపు అడుగులు వేసింది ఈ బ్యూటీ.
జోడి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన త్రిష్.. ఆ తర్వాత మౌనం పెసియాదే అనే తమిళ సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది.
ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ సరసన నటించిన వర్షం సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. తెలుగు, తమిళంలో అగ్ర కథానాయికగా ఎదిగింది.
త్రిష ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.4 నుంచి 5 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అలాగే ఆమె ఆస్తులు రూ.85 కోట్లకు పైగానే ఉన్నాయని టాక్.
త్రిషకు హైదరాబాద్, చెన్నైలో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయట. ఈ బ్యూటీ దగ్గర లక్షలు విలువైన లగ్జరీ కార్లు, జ్యువెల్లరీ ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్