09 October 2024
అలాంటి వ్యక్తిపై మనసుపడిన త్రిప్తి.. కాబోయేవాడు ఎలా ఉండాలంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఏ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రీ.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో కీలకపాత్రలో నటించి అబ్బాయిల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
యానిమల్ సినిమాతో ఈ అమ్మడు కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీంతో ఇప్పుడు హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది.
అటు సోషల్ మీడియాలోనూ నిత్యం లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది ఈ బాలీవుడ్ హీరోయిన్.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కభీ హాన్ కభీ నా సినిమాలో కింగ్ ఆఫ్ రొమాన్స్ పాత్ర గురించి మాట్లాడుతూ అమాయకత్వం నిజమైన ప్రేమకు చిహ్నం అని తెలిపింది.
షారుఖ్ పాత్ర తన అన్నపై ఉన్న ప్రేమ స్వచ్ఛమైనదని.. అందుకే తనకు కాబోయే వాడి నుంచి అలాంటి ప్రేమ కావాలని ఉందని తెలిపింది.
తాను సంబంధాల విషయంలో ఎప్పుడూ సీరియస్ గా ఉంటానని తెలిపింది. బంధంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.