17 October 2025

ఒక్క సినిమాతో మారిన క్రేజ్.. దెబ్బకు రెమ్యునరేషన్ పెంచేసిన వయ్యారి.

Rajitha Chanti

Pic credit - Instagram

ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. కుర్రాళ్ల నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ వయ్యారి. 

ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమాతో ఆమె పేరు నేషనల్ లెవల్లో మారుమోగింది. ఆ తర్వాత హిందీలో వరుస అవకాశాలు, హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ పెంచేసిందట.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో త్రిప్తి డిమ్రీ కథానాయికగా కనిపించనుంది.

అయితే ఈ సినిమా కోసం ఇప్పుడు త్రిప్తి డిమ్రీ తీసుకునే రెమ్యునరేషన్ గురించి నెట్టింట టాక్ నడుస్తుంది. గతంలో యానిమల్ సినిమాలో చిన్న పాత్ర కోసం ఈ బ్యూటీ రూ. 40 లక్షలు తీసుకుందట.

గతంలో ఒక్కో సినిమాకు త్రిప్తి డిమ్రీ రూ.30 లక్షలు తీసుకుందని టాక్. కానీ యానిమల్ సినిమా తర్వాత ఈ బ్యూటీకి హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టడంతో రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్.

ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం ఆమె దాదాపు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆమె తీసుకునే అత్యధిక రెమ్యునరేషన్ ఇదే కావడం గమనార్హం.

స్పిరిట్ మాత్రమే కాకుండా త్రిప్తికి హిందీలో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. అలాగే స్పిరిట్ చిత్రంలో ఆమె పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందనే టాక్ నడుస్తోంది.