TV9 Telugu

02 March 2024

బోల్డ్ సీన్స్ చూసి నా పేరెంట్స్ గర్వపడుతున్నారు: త్రిప్తి డిమ్రి.

యానిమల్ మూవీ సెన్సేషన్ అంత ఇంత కాదు.. ఈ సినిమాలో నటించిన త్రిప్తి డిమ్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.

ఈ సినిమాలో హీరోయిన్ త్రిప్తి డిమ్రి కనిపించింది తక్కువే అయినప్పటికీ విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.

అలాగే ఈ ముద్దుగుమ్మ  చేసిన బోల్డ్ సన్నివేశాల కారణంగా ట్రోల్స్ గురయ్యింది. దీని పై ఆమె చాలా కాలం మౌనం వహించింది.

తాజాగా తన పై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ.. ట్రోల్స్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది త్రిప్తి డిమ్రి.

అతిధి పాత్ర అయినప్పటికీ ఆసక్తికరంగా అనిపించింది. అందుకే నటించాను. ‘నేను ఈ సినిమా చేయడానికి కారణాలు నాకు తెలుసు.

సందీప్ రెడ్డి వంగ చిన్న పాత్రలో నటించాలని నాకు ముందే చెప్పారు. కథ చెప్పిన తర్వాత నాకు చాల ఆసక్తికరంగా అనిపించింది.

ప్రేక్షకులు చెప్పేదానిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ఆర్టిస్ట్‌గా నేను చేయాలనుకున్నది చేయలేను’ అని త్రిప్తి చెప్పుకొచ్చింది.

‘‘నా కంఫర్ట్ జోన్‌కు మించిన పాత్రలు చేయడం నాకు ఇష్టం. పాత్రలు చేసేటప్పుడు చాలా సలహాలు వస్తాయి. నేను అన్నీ వింటాను. 

‘సినిమాలో నా బోల్డ్ సీన్ రాగానే పేరెంట్స్ కేకలు వేశారు.నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడుతున్నారని త్రిప్తి  చెప్పకోచింది.