హీరోయిన్ త్రిప్తి డిమ్రీ బ్యాడ్‌ న్యూస్‌.. 

Anil Kumar

27 June 2024

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్‏గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ.

ఈ సినిమాలో గ్లామర్ గేట్లు ఎత్తి.. తన అందం, అభినయంతో కట్టిపడేసి ఒకేసారిగా ఫేమస్ అయ్యింది ఈ వయ్యారి భామ.

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది.

ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించినా.. త్రిప్తికే అత్యధిక ఫాలోయింగ్ వచ్చింది.

ఇక ఈ యానిమల్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి తన నెక్స్ట్ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

కత్రినా హస్బెండ్ విక్కీ కౌశల్‌ హీరోగా నటిస్తున్న బ్యాడ్‌ న్యూస్‌ మూవీలో కీ రోల్‌ చేశారు త్రిప్తి డిమ్రి.

ఈ బ్యాడ్‌ న్యూస్‌ సినిమాను వచ్చే నెల అనగా జులై 19న విడుదల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్.

ఈ బ్యాడ్‌ న్యూస్‌ సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్టు.. తెలిపారు మూవీ మేకర్స్.