మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ వయ్యారి భామ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ప్రస్తుతం స్పీడ్ తగ్గించింది.
అందాల భామ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది.
ఈ చిన్నది తెలుగులో ఒకప్పుడు తోప్ హీరోయిన్.. చేసిన సినిమాలనే సూపర్ హిట్స్.. దాంతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
మంచు మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తమన్నా. ఆతర్వాత హ్యాపీడేస్ సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో మెరిసింది.
కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ తమన్నా తన సత్తా చాటింది. ఈ చిన్నది చేసిన స్పెషల్ సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది.
కెరీర్ బిగినింగ్ లో నేను కొన్ని కండీషన్స్ పెట్టుకున్నా అందుకే ఎన్నో మంచి ఛాన్స్ లు మిస్ చేసుకున్నా..అని తమన్నా తెలిపింది.
హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత నా కండీషన్స్ పక్కన పెట్టేశా.. బోల్డ్ , గ్లామర్ రోల్స్ చేయడం ప్రారంభించా.. దాంతో నా కెరీర్ టర్న్ అయ్యింది అని చెప్పుకొచ్చింది.