పంచకట్టులో మెరిసిన మిల్కి బ్యూటీ.. అదిరిపోయిందిగా 

Rajeev 

29 May 2024

తెలుగులో ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. 

తెలుగులో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

కానీ ఇప్పుడు ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించిందనే చెప్పాలి. ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. 

బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. 

ఇటీవలే అక్కడ ఓ వెబ్ సీరీస్ లో అందర్నీ ఆకట్టుకుంది. ఓరేంజ్ లో అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ. 

త్వరలోనే తమన్నా పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తుంది. విజయ్ వర్మతో ప్రేమలో ఉంది తమన్నా. 

త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని టాక్. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా కొన్ని ఫోటోలు వదిలింది.