TV9 Telugu

05 February 2024

కొండచిలువతో హీరోయిన్‌ సుస్మితా సేన్‌ సావాసం.

సెలబ్రెటీల్లో పెట్స్‌ ఇష్టపడేవారు ఎవరైనా ఫస్ట్‌ ప్రయారిటీ ఇచ్చేది డాగ్స్‌కే. కొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు.

కానీ పాములను పెంచుకోవడం ఎక్కడైనా చూశారా? పాము పేరు చెబితేనే కొందరు వణికిపోతారు.

అది కనబడితే ఆమడదూరం పారిపోతారు. అలాంటిది పాములను పెంచుకునేవాళ్లు కూడా ఉన్నారు.

అది ఎవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సుస్మితా సేన్‌. అవును సుస్మిత ఓ పామును పెంచుకుంటున్నారట.

సుస్మితాకి పాములంటే చాలా ఇష్టమట. అందుకే ఇప్పుడు పామును పెంచుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది.

సరే అది ఇది ఎందుకని ఏకంగా కొండచిలువనే పెంచుకుంటున్నారట. ఖాళీ దొరికినప్పుడల్లా ఆ కొండచిలువతో ఆడుకుంటున్నారట.

సరే అది ఇది ఎందుకని ఏకంగా కొండచిలువనే పెంచుకుంటున్నారట. ఖాళీ దొరికినప్పుడల్లా ఆ కొండచిలువతో ఆడుకుంటున్నారట.

అయితే తన కొండ చిలువకు సంబంధించిన విషయాలను సుష్మితా ఎక్కడా చెప్పలేదు కానీ..

ఆమె సన్నిహితుల ద్వారా మీడియాకు ఈ విషయం లీకైంది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.