కొత్తపెళ్ళికూతురిలా ముస్తాబైన ముద్దుగుమ్మ సుప్రీత..
Rajeev
16 May 2024
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి సురేఖ వాణి. ఇప్పుడు ఆమె కూతురు సినిమాల్లోకి రానుంది.
సురేఖావాణి కూతురు సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే ఆమె కొత్త సినిమా ప్రారంభం అయ్యింది.
బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో సుప్రిత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత సుప్రీత వరుస అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.
సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. నెట్టింట తెగ సందడి చేస్తుంది ఈ బ్యూటీ.
తల్లి సురేఖా వాణి, సుప్రీత చేసిన వీడియోలు, షేర్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికి తెలుసు.
పద్దతిగా కనిపిస్తే ఛాన్స్ దొరికినప్పుడల్లా తనలోని గ్లామర్ యాంగిల్ ను బయట పెడుతుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా కొత్తపెళ్లి కూతురులా చీరకట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది సుప్రీత. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి