05 October 2025

నన్ను ప్రభాస్ లేడీ వెర్షన్ అంటారు.. యంగ్ హీరోయిన్ కామెంట్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 

ఆ తర్వాత తెలుగులో న్యాచురల్ స్టార్ నాని జోడిగా హిట్ 3 చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది.

ఇప్పుడు ఈ అమ్మడు తెలుసు కదా సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 

ఈ సినిమాను అక్టోబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది.

తనను ప్రభాస్ లేడీ వెర్షన్ అంటారని కామెంట్స్ చేసింది. తన ఫ్రెండ్స్ అందరూ తనను లేడీ ప్రభాస్ అంటారని.. ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియా ఉపయోగించరు.

తాను కూడా ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండనని.. అందుకే తనను ప్రభాస్ లేడీ వెర్షన్ అంటారని చెప్పుకొచ్చింది. ప్రభాస్ బిగ్ స్టార్ అని తెలిపింది.

తాను ఫోటోస్ తీసుకోకుండా ఉండనని.. ఏదైనా సందర్భంలో ఎక్కడికి వెళ్లిన ఫోటోస్ తీసుకుంటానని.. ఫోటో షూట్ ప్లానింగ్ ఉండదని చెప్పకొచ్చింది. శ్రీనిధి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.