TV9 Telugu
టాలీవుడ్ కి మరో హీరోయిన్.? ట్రెండ్ నుండి ట్రెడిషనల్ వరకు గౌరీ ప్రియా.
17 April 2024
ప్రియ దర్శి మెయిన్ లీడ్ గా ‘మెయిల్’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీ గౌరి ప్రియా.
లవ్ స్టోరీ, శ్రీకారం సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన గౌరి తాజాగా మాడ్ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ పలు సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటోందీ అందాల ముద్దుగుమ్మ గౌరీ.
ఇక సోషల్ మీడియాలోను గౌరీ ప్రియా కు ఫాలోయింగ్ బనే ఉంది.. ఎప్పటికప్పుడు తాజా ఫొటోస్ తో ఆకట్టుకుంటుంది.
అప్పుడప్పుడు ఈ అమ్మడి ఫొటోస్ వైరల్ అవుతాయి.. కొన్ని ఫొటోస్ లో అచ్చం సమంతలా ఉందనిని నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటారు.
జూనియర్ సమంతలా ఉందే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో రాజీలా ఉందే అంటున్నారు.
ఈ అమ్మడు మొదటి సినిమా నుండే తనదైన శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తూ తనకంటూ గుర్తింపుతో అవకాశాలు అందుకుంటుంది.
ఇక శ్రీ గౌరి 2018లో మిస్ హైదరాబాద్ కిరీటాన్ని దక్కించుకుని, తరువాత యాక్టింగ్ మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి