14 February 2025
బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఆ రొమాంటిక్ మూవీలో కిస్సిక్ బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత రవితేజ సరసన ధమాకా సినిమాతో భారీ హిట్టు కొట్టింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న పరాశక్తి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో మొదటి సారిగా నటించనుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఈ అమ్మడు హిందీలో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. హిందీలో రొమాంటిక్ మ్యూజికల్ ఆషికి ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉంది.
గతంలో వచ్చిన ఆషికీ 2 సైతం సూపర్ హిట్ అయ్యింది. ఇటీవలే ఆషికీ 3 సినిమాను సైతం ప్రకటించారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారని టాక్.
అయితే ఇందులో ముందుగా త్రిప్తి డిమ్రీని కథానాయికగా ఎంచుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆమె స్థానంలోకి సౌత్ హీరోయిన్ ను సెలక్ట్ చేయాలని భావించారట
దీంతో ఆషికీ 3 కోసం కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీలను ఎంపిక చేసినట్లుగా ప్రచారం నడుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్