తెలుగు మేకర్స్‌కు శ్రీలీల బిగ్ షాక్

22 December 2023

TV9 Telugu

అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించింది శ్రీలీల.

అందం, అభినయం.. అంతకు మించి హీరోలకు పోటీగా డాన్స్ స్టెప్పులతో అందరగొట్టేసింది.

ఇంకేముంది తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లను సైతం పక్కకు నెట్టేసింది.

చిన్న హీరో , పెద్ద హీరో అనే తేడా లేకుండా అర డజనుకు పైగా సినిమాలను అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ.

ఓవైపు ఎంబీబీఎస్ చదువుకుంటూనే ఇటు సినీ పరిశ్రమలో నటిగా కొనసాగుతుంది. 

అయితే ప్రస్తుతం శ్రీలీల ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని టాక్ వినిపిస్తుంది.

మెడిసిన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని.. అందుకు కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందట.

పరీక్షలు కంప్లీట్ అయ్యేవరకు ఏ సినిమా షూటింగ్‏లోనూ పాల్గొనరని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాకెక్కి తెగ వైరల్ అవుతోంది.