18 August 2024

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు నో చెప్పిన శ్రీలీల.. ఎందుకంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ సృష్టించింది హీరోయిన్ శ్రీలీల. తెలుగు మూలాలున్నప్పటికీ కన్నడ సినిమాలతో కథానాయికగా మారింది. 

పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‏గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాదికో నెలకో సినిమాతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నఈ బ్యూటీకి ఇప్పుడు అదృష్టం కలిసిరావడంలేదు. శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ ఫెయిలయ్యాయి. 

శ్రీలీల ప్రస్తుతం హిందీ, తెలుగులో సినిమాలు చేస్తుంది. గతేడాది చేసిన సినిమాలన్నీ ఫెయిలవడంతో ఆలోచనలో పడింది హీరోయిన్. 

బాక్సాఫీస్ వద్ద ఈ హీరోయిన్ నటించిన సినిమాలు ఫెయిలవడంతో తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. 

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమాలో ఛాన్స్ రిజెక్ట్ చేసిందట హీరోయిన్ శ్రీలీల. 

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇందులో ఆషికా రంగనాథ్, సురభి, ఈషా చావ్లా నటిస్తున్నారు. 

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు శ్రీలీలను సంప్రదించారట. కానీ అందుకు ఈ ముద్దుగుమ్మ నో చెప్పిందని టాక్ నడుస్తుంది.