05 June 2025

ఒక్క పాటతోనే రచ్చ.. 3 నిమిషాలకు 2 కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకే ఒక్క స్పెషల్ సాంగ్‏తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఏడాదిలోనే ఏకంగా అరడజనుకు పైగా చిత్రాలతో ప్రేక్షకులను కవ్వించింది. 

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మూడు నిమిషాల పాటకు ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేస్తుంది ఈ వయ్యారి.

ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా..? 14 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన ముద్దుగుమ్మ శ్రీలీల. 

టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు అక్కినేని అఖిల్ జోడిగా లెనిన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. 

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ నటిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. 

ఇటీవలే అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. కిస్సిక్ పాటకు మాస్ స్టెప్పులతో దుమ్మురేపింది. 

అయితే ఈ మూడు నిమిషాల పాటకు శ్రీలీల ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంది. అలాగే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అయ్యింది. 

ఒక్కో పాటకు 2 నుంచి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట ఈ వయ్యారి. అటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో తెగ రచ్చ చేస్తుంది ఈ హ్యూటీ.