TV9 Telugu
2023 శ్రీలీలకు అంతగా కలిసిరాలే.! అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలే.!
26 December 2023
తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శ్రీలీల.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.
చేసింది ఆరు సినిమాలే అయిన ఈ చిన్నదానికి టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది శ్రీలీల. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది.
2023లో శ్రీలీల స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది.
ఆతర్వాత నటసింహం బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈసినిమాలో శ్రీలీలనటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన ఆదికేశవ సినిమా దారుణంగా నిరాశపరిచింది.
ఆతర్వాత నితిన్ హీరోగా నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మిక్స్ టాక్ తెచ్చుకుంది.
దాంతో ఈ ఏడాది శ్రీలీల నాలుగు సినిమాలు చేసిన ఒకే ఒక్క హిట్ అందుకుంది. అయినా కూడా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి