04 September 2023
నాడు పూజ , నేడు రష్మిక.. శ్రీలీలతో మాములుగా ఉండదు మరి..!
టాలీవుడ్ లో శ్రీలీల ఇప్పుడు టాప్ పొజిషన్‌లో దూసుకుపోతుంది. వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతూ దుమ్ములేపుతుంది.
పూజా హెగ్డే రష్మిక మందాన లాంటి వాళ్లని కూడా పక్కన పెట్టేస్తూ శ్రీలీలను తీసుకుంటున్నారు టాలీవుడ్ మేకర్స్.
మొన్నటికి మొన్న కారణాలు తెలియవు కానీ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు రష్మిక కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైయ్యింది అని సమాచారం ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తుంది.
నితిన్ 32వ సినిమాలో ముందుగా రష్మిక మందనను ఖరారు చేసుకున్నారు. ఈ జంట ఇప్పటికే భీష్మ మూవీలో కలిసి నటించారు.
కాగా తాజాగా రష్మిక మందన స్థానాన్ని శ్రీలీల కబ్జా చేసింది అని తెలుస్తోంది.రష్మిక మందన స్థానంలో శ్రీలీల వచ్చి చేరినట్టు సమాచారం.
కారణాలు ఏవైనా కానీ ఇది ఒక రకంగా నేషనల్ క్రష్ రష్మిక మందనకు ఇబ్బందికరమైన పరిణామమే అని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు..
ఏది ఏమైనా శ్రీలీల జోష్ ఫుల్ ఫార్మ్ లోనే ఉందని చెప్పాలి.. చేసింది ఒక్క సినిమానే అయినా వరసపెట్టి 7 సినిమాల్లో అవకాశం కొట్టేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి