TV9 Telugu

నన్ను కావాలనే ఈ దొంగతనం కేసులో ఇరికించారు: సౌమ్య శెట్టి.

21 March 2024

వైజాగ్‌కు చెందిన సౌమ్య శెట్టికి పలు షార్ట్‌ ఫిలింస్‌లో నటించి చిన్న చిన్న సినిమాల్లోనూ ఛాన్స్‌లు దక్కించుకుంది.

ఇటీవల ఫ్రెండ్ ఇంట్లో బంగారం కొట్టేసి గోవాకు చెక్కేసిన హీరోయిన్‌ సౌమ్య శెట్టి తాజాగా మీడియా ముందుకు వచ్చారు.

తాను బంగారం దొంగతనం చేయలేదని, తనను పావుగా వాడుకొని కావాలని తనను దొంగతనం కేసులో ఇరికించారని తెలిపింది.

ఈ క్రమంలో తనను, తన కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేశారని, తనను మీడియా ముందుకు రాకుండా చేశారని తెలిపింది.

తనపై పోలీసులు సైతం అసత్య ఆరోపణలు మోపారని, తనపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. మౌనిక తనకు బంగారం ఇచ్చి తనను ట్రాప్‌ చేసిందని తెలిపారు.

మౌనికను అసభ్యకర ఫోటోలతో బెదిరిస్తున్నారని సో తనకు బంగారం ఇచ్చి తాకట్టు పెట్టమని చెప్పిందని సౌమ్య వివరించింది.

తనపై దొంగతనం కేసు బనాయించక ముందే తాను తన భర్తతో కలిసి గోవాకు వెళ్లానని సౌమ్య తెలిపింది తాజాగా తెలిపింది.