27 July 2024
చావు గురించి ఆలోచించడం మంచిదే అంటోన్న హీరోయిన్.. కారణం అదేనట..
Rajitha Chanti
Pic credit - Instagram
యానిమల్ నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సోనమ్ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
ఢిల్లీ 6, ఐ హేట్ లవ్ స్టోరీస్, ఐషా థాంక్యూ, బేవకూఫియాన్, నీర్జ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా బ్లైండ్ సినిమాలో కనిపించింది.
హాలీవుడ్ యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కెను రీవ్స్ మాట్లాడిన మాటలకు మద్దతు తెలిపింది. చావు గురించి ఆలోచించడం మంచిదే అంటోంది.
కెను రీవ్స్ ద బుక్ ఆఫ్ ఎల్స్వేర్ అనే నవల రాయగా.. త్వరలోనే దానిని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు.
తను చావు గురించి ఆలోచిస్తుంటానని.. దానివల్ల మనం ఊపిరి తీసుకున్నంతకాలం బంధాలకు విలువనివ్వాలని తెలుస్తుందని అన్నాడు కెను రీవ్స్.
దీంతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పాజిటివ్ ఆలోచని వస్తాయని పేర్కొన్నాడు. ఇక కెను రీవ్స్ మాటలు కరెక్ట్ అంటుంది సోనమ్ కపూర్.
కెను రీవ్స్ ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ చావు గురించి ఆలోచించడం మంచిదే.. ఇది కరెక్ట్ అంటూ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చేయండి.