సోనాక్షి సిన్హా బ్యాచిలర్ పార్టీనా.? నెట్టింట ఫొటోస్ హల్ చల్..

Anil Kumar

19 June 2024

బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. ఈమధ్య కాలంలో బీ టౌన్ లో ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న పేరు..

ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇక సోనాక్షి పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ నెల 23న బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ను సానాక్షి పెళ్లి చేసుకోబోతున్నారన్న జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే సోమవారం రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నారు సోనాక్షి. అది ఎం పార్టీయో క్లారిటీ లేనప్పటికీ..

ఆ ఫోటోలు కాస్త వైరల్ కావటంతో అవి ఆమె బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫోటోసే అంటున్నారు బాలీవుడ్ జనాలు..

జహీర్ ఇక్బాల్‌ తో సోనాక్షి దాదాపు రెండేళ్ల డేటింగ్‌ తరువాత ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కనున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ ఇరువురికి చాలా మంది ప్రముఖులు, సినీతారలు సైతం తమ విషెస్ కూడా తెలుపుతున్నట్టు తెలుస్తుంది.

అలాగే సోషల్ మీడియాలో కూడా సోనాక్షి అభిమానులు ఊరుకుంటారా.? ఆమె ఫోటోలను విపరీతంగా వైరల్ చేస్తున్నారు..