నా భర్త ఆ అమ్మాయిని ప్రేమించాడు: స్నేహ

TV9 Telugu

18 April 2024

 టాలీవుడ్‌ లో దివంగత సౌందర్య తర్వాత హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అందాల నటి బాపూ బొమ్మ స్నేహ.

ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ సినిమాల్లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

సినిమాల్లో బిజీ బిజీగా ఉండగానే 2012లో ప్రముఖ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకుంది స్నేహ. ఈ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు.

పెళ్లి తర్వాత హీరోయిన్ రోల్స్ కు దూరమైన స్నేహ స్పెషల్ రోల్స్ తో అభిమానులను అలరిస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తిలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి.

తెలుగులో చివరగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో స్నేహ నటించినట్లు గుర్తు.

ఇదిలా ఉంటే తాజాగా  ఓ ఇంటర్వ్యూలో తన భర్త ప్రసన్న గురించి అలాగే ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది స్నేహ.

గతంలో నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ వారికి బ్రేకప్‌ అయింది. ఆ బ్రేకప్‌ జరిగి ఉండకపోతే నాకు ప్రసన్న భర్తగా దొరికేవాడే కాదని చెప్పుకొచ్చింది.

ఇదే సందర్భంగా పొజెసివ్‌నెస్‌ ఉండాలి.. కానీ అతిగా ఉండకూదు. అది ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్‌ చేయలేమంటూ ఫిలాసఫీ చెప్పుకొచ్చింది స్నేహ.