15 February 2025

అవమానించారు.. అందుకే ఇలా చేస్తున్నాను.. హీరోయిన్ స్నేహ..

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. 

అయితే కెరీర్ ప్రారంభంలో తనను కొందరు అవమానించారని.. అందుకే ఇప్పుడు వేసిన డ్రెస్ మళ్లీ వేసుకోను అంటుంది ఈ మద్దుగుమ్మ. ఎవరంటే. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ స్నేహ. 2000లో ఎన్నవలే సినిమాతో తెరంగేట్రం చేసింది. గోపిచంద్ సరసన తొలి వలపు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. శ్రీరామదాసు, రాధా గోపాలం, మధుమాసం, వెంకీ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 

కెరీర్ ప్రారంభంలో వరుసగా ఒకే డ్రెస్ వేసుకురావడాన్ని చూసి పత్రికల్లో ఆమె దగ్గర వేరే డ్రెస్ లేదా అని రాశారట. దీంతో మళ్లీ అలాంటి పని చేయొద్దు అనుకుందట.

అందుకే ఒకసారి వేసుకున్న డ్రెస్ మళ్లీ వేసుకోవడం లేదని అంటుంది స్నేహ. ప్రస్తుతం స్నేహ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టి స్నేహాలయం షాపింగ్ మాల్ నడుపుతోంది. 

ఫ్యామిలీ విషయానికి వస్తే తమిళ్ స్టార్ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చింది స్నేహ.