03 November 2025
44 ఏళ్ల వయసులో తరగని అందం.. స్నేహ డైట్ సీక్రెట్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో స్నేహ ఒకరు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోయింది.
తొలివలపు, ప్రియమైన నీకు, సంక్రాంతి, శ్రీరామదాసు వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది.
కానీ కొద్ది రోజులుగా సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. ప్రస్తుతం స్నేహలయం పేరుతో చీరల షాపింగ్ మాల్ ఓపెన్ చేసి బిజీగా ఉంది.
44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుంది. గతంలో ఓ ఇంటర్యూలో తన డైట్, ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేసింది స్నేహ.
రోజులో ఎన్ని కేలరీలు తీసుకుంటారనే దానిపై తన డైట్ ఆధారడి ఉంటుందని.. ప్రతి రోజూ మాక్రో కౌంటింగ్ చేస్తానని, చక్కర తీసుకోనని తెలిపింది.
చక్కెరకు దూరంగా ఉంటానని.. అలాగే ఎక్కువగా పిండి పదార్థాలు తీసుకుంటానని తెలిపింది. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటుంది.
తక్కువ మసాలా, తక్కువ ఉప్పు తీసుకుంటుందట. సోడాలు, ఫ్లేవర్డ్ కాఫీలు, ప్యాక్ చేసిన స్నాక్స్ ఆహార పదార్థాలను తీసుకుంటానని చెప్పుకొచ్చింది స్నేహ
ప్రతిరోజూ వ్యాయమం తప్పకుండా చేస్తానని.. పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన భోజనమే తీసుకుంటానని.. హైడ్రేట్ గా ఉండేలా చూసుకుంటుందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్