TV9 Telugu

దేవరలో ఎన్టీఆర్ భార్య శృతీ మరాఠే అయితే మరి జాన్వీ సంగతేంటి.?

25 March 2024

ట్రిపుల్ ఆర్ తర్వాత జూ.ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాపై అటు నార్త్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ హైప్ నెలకొంది.

ఈ సినిమాలో సరికొత్త మాస్ అవతారంలో కనిపించనున్న ఎన్టీఆర్. ఇటీవల విడుదలైన పోస్టర్ మూవీపై ఆసక్తిని కలిగించింది.

ఇక కొరటాల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె మరాఠీ, తమిళ్లో అనేక సినిమాలు చేసిన  గుజరాతీ ముద్దుగుమ్మ శృతీ మరాఠే ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది.

అయితే తాజాగా ఈ న్యూస్‌ను తనే స్వయంగా కన్ఫర్మ్‌ చేసింది ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతీ మరాఠే..

సోషల్ మీడియాలో న్యూసులు వస్తున్నట్టే, అందరూ అనుకుంటున్నట్టే, ఆమె దేవర మూవీలో నటిస్తున్నట్టు తెలిపింది.

అంతేకాదు సినిమాలో ఈ అమ్మడి పాత్ర ఏంటో కూడా రివీల్ చేస్తూ సినిమాలో తాను దేవరకు భార్యగా కనిపిస్తానని ఎగ్జైట్ గా తెలిపింది.

అంతేకాదు ఎన్టీఆర్ అభిమానుల మాదిరిగానే తాను కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది శృతి.