TV9 Telugu
టాలీవుడ్ హీరోలపై బోల్డ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్.
17 February 2024
శ్రుతి హాసన్ చాలా విషయాల గురించి మాట్లాడుతుంది. ఆమె తన వ్యక్తిగత విషయాలు,కెరీర్ గురించి చాలాసార్లు బహిరంగంగానే మాట్లాడుతుంది.
అంతేకాదు ఏవిషయంపైనైనా బోల్డ్ కామెంట్స్ చేయడానికి వెనుకడగు వేయదు. కుండబద్దలు కొట్టేలా మాట్లాడగలదు. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
చాలా మంది హీరోలకు కొత్తగా ప్రయత్నించే ధైర్యం ఉండదని చెప్పేసింది. కానీ ఇక్కడే మా నాన్న కమల్ హాసన్ ప్రత్యేకంగా నిలుస్తారు. అని శృతి చెప్పింది.
ఈ చర్చలో ఆమె తన తల్లి సారిక కెరీర్‌ను కూడా ప్రతిబింబించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడింది.
తన కెరీర్ విషయానికొస్తే, సంగీతం, సినిమాలు రెండింటినీ కొనసాగిస్తానని హీరోయిన్ శృతి హాసన్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఆమె అడివి శేష్ సరసన “డెకాయిట్” అనే చిత్రంలో నటిస్తోంది. అదనంగా, “చెన్నై స్టోరీ” మరియు “సలర్ పార్ట్-2” నటిస్తోంది
ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ఆ మధ్య వేగం తగ్గించినా శృతి గత ఏడాది వరుస హిట్స్ దూసుకుపోయింది.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ ను అందుకుంది హీరోయిన్ శృతి హాసన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి