ఓయబ్బో.. ఏం హొయలు .. ఎన్ని ఒంపులో 

Rajeev 

09 April 2024

అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శ్రుతిహాసన్. 

ఆతర్వాత హీరోయిన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ అమ్మడు. గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ అందుకుంది. 

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అమ్మడి జాతకం మారిపోయింది. 

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ చిన్నది. 

ప్రస్తుతం ఈ చిన్నది స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ బడా హీరోలతో సినిమాలు చేస్తోంది. 

ఇటీవలే సలార్ సినిమాతో హిట్ అందుకుంది శ్రుతిహాసన్. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సోషల్ మీడియాలో శ్రుతిహాసన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు. 

తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది శ్రుతిహాసన్.. ఈ ఫొటోల్లో చాక్లెట్ కలర్ చీరలో మెరిసింది శ్రుతిహాసన్.