పాన్ ఇండియా సినిమాలే టార్గెట్.. ఆచితూచి అడుగులేస్తున్న శృతి
13 September 2025
Rajeev
శ్రుతిహాసన్ కెరీర్ బిగినింగ్ లో ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే కెరీర్ బిగినింగ్ లో వరుసగా ఫ్లాప్స్ అందుకుంది.
ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఓ సినిమా చేసిందో ఈ ముద్దుగుమ్మ జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి.
శ్రుతిహాసన్ రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు ప్రభాస్ సలార్, రజినీకాంత్ కూలీ సినిమాలు చేసింది.
ఓ ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. శ్రుతి కెరీర్ బిగినింగ్ లో వరుస ఫ్లాప్స్ అందుకుంది.. ఆతర్వాత హిట్స్ అందుకుంది.
అయితే ఫ్లాప్స్ అందుకున్న సమయంలో శ్రుతిని ఐరన్ లెగ్ అని కొంతమంది ట్రోల్ చేశారు. దాని పై ఆమె స్పందించింది.
కెరీర్ స్టార్టింగ్ లో సిద్దార్థ్ తో వరుసగా సినిమాలు చేశా.. ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో మీరు అర్ధం చేసుకోవచ్చు ఐరెన్ లెగ్ ఎవరో అని చెప్పుకొచ్చింది.