ఇకపై ఊరుకోను అంటూ.. ఫ్యాన్‌కు శృతి హాసన్ సీరియస్ వార్నింగ్.

Anil Kumar

23 June 2024

విశ్వనాయకుడు- దశావతారం కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది హీరోయిన్ శ్రుతి హాసన్.

తన తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చిన.. కస్టపడి తనకంటూ స్పెషల్ స్టార్ డమ్ సంపాదించుకుంది శ్రుతి హాసన్.

ఇక ఈ ముద్దుగుమ్మ నటిగానే కాక., సింగర్ గా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.

ఎప్పుడూ చేతినిండా సినిమాలతో.. తెలుగు, హిందీ, తమిళ భాషలలో స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్స్ అందుకుంది.

తాజాగా తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేసింది శృతి.. అందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.

ఆస్క్‌ మీ సమ్‌థింగ్ అని శృతి చిట్ చాట్లో.. ఓ ఫ్యాన్ సౌత్ ఇండియన్ ఆక్సెంట్‌లో ఏదైనా చెప్పాలని శృతిని రిక్వెస్ట్ చేశాడు.

అయితే ఈ రిక్వెస్ట్‌కే సీరియస్‌ అయిన శృతి  ఈ రకమైన జాతి వివక్షను తాను అసలు సహించను అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

అంతేకాదు మమ్మల్ని ఇడ్లీ, సాంబర్ అంటూ పిలిస్తే ఊరుకునేది లేదని.. మీరు మమ్మల్ని ఎప్పటికీ అనుకరించలేరని తెలిపింది.