మొదట్లో ఐరెన్ లెగ్ అన్నారు.. ఇప్పుడు అందరికీ ఆమె  లక్కీ చార్మ్

Rajeev 

24 July 2024

 యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శ్రుతిహాసన్. 

అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తొలిసారి హీరోయిన్ గా సినిమా చేసింది. అలాగే తన నటనతో ఆకట్టుకుంది . 

ఓ మై ఫ్రెండ్ సినిమాలో చేసింది. ఈ సినిమా అంతగా ఆడలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, క్రాక్, వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు చేసింది. 

ఇక రీసెంట్ గా ప్రభాస్ తో సలార్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతుంది శ్రుతిహాసన్. 

కాగా ఈ చిన్నది ఇండస్ట్రీకి వచ్చి నేటికీ సరిగ్గా 15 ఏళ్లు అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది ఈ భామ. 

కెరీర్ బిగినింగ్ లో ఫ్లాప్స్ రావడంతో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. కానీ అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది శ్రుతిహాసన్.