TV9 Telugu
షూటింగ్ నుంచి పారిపోయిన శ్రియ.! ఎందుకంటే.?
19 March 2024
సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా మంచి ఎక్స్ పీరియన్స్ వచ్చాక అంతా బావుందని అనుకోవడంలో గొప్పేం ఉంది..?
అసలంటూ ఏమీ తెలియకముందు నిలదొక్కుకోవాలనే కసితో పనిచేయడంలో గొప్ప ఉందని అంటున్నారు హీరోయిన్ శ్రియా శరణ్.
2001 ఇష్టం సినిమాతో పరిచయం అయ్యిన శ్రియా కెరీర్ తొలినాళ్లల్లో ఈ అమ్మడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
ఓ సారి షూటింగ్ నుంచి కూడా పారిపోయారట ఈ భామ. అయినా, ఎలాగోలా నిలదొక్కుకుని సినిమాలు చేశానని అంటారు శ్రియ.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శివాజీ సినిమా చేశారు శ్రియ శరణ్. ఆ సమయంలో..
''అందం తరిగిపోతుంది. ఫేమ్ మసకబారుతుంది.. అయినా ప్రేక్షకులను ఇదే ప్రేమతో పలకరించడం మర్చిపోవద్దు'' అని..
ఆ టైమ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన సలహాను ఇప్పటికీ ఫాలో అవుతున్నట్టు తెలిపారు హీరోయిన్ శ్రియా శరణ్.
ఇక సినిమాల విషయానికి వస్తే అమ్మ అయినా తరువాత కొంచెం స్పీడ్ తగ్గించియిందనే చెప్పాలి.ఆర్ ఆర్ ఆర్ లో చివరిగా కనిపించింది శ్రియా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి