కేక పెట్టించిన జెర్సీ భామ.. నెట్టింట శ్రద్ధా శ్రీనాథ్ రచ్చ

september 3

Rajeev 

న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్ధా శ్రీనాథ్. మొదటి సినిమాతోనే తల్లి పాత్రలో మెప్పించింది.

అంతకు ముందు 2015లో మలయాళంలో వచ్చిన కోహినూర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత ముంగారు మేల్ 2, ఉర్వి, కాట్రు వెళియదై, ఇవన్ తంతిరాన్, విక్రమ్ వేద, రిచి, కృష్ణ అండ్ హిజ్ లీలా, డాకు మహారాజ్ వంటి చిత్రాల్లో నటించింది.

తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడుకి మంచి ఫాలోయింగ్ ఉంది.

అయితే ఇన్నాళ్లు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. నెట్టింట రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.

కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఖాతాలో వరుసగా గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తుంది.

 కేక పెట్టించే అందాలతో కుర్రకారు మనసులు కొల్లగొట్టేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇండస్ట్రీలో సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది.