24 September 2025
లిప్‍లాక్ సీన్స్ ఉన్నాయని రిజెక్ట్.. 100 కోట్ల సినిమా మిస్సైన బ్యూటీ
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగుల ప్రపంచంలో హీరోయిన్గా నిలదొక్కుకోవడం అంటే మాములు విషయం కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
అయితే ఓ అమ్మడు మాత్రం కెరీర్ ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైంది. రొమాన్స్, లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని 100 కోట్ల హిట్ మూవీ రిజెక్ట్ చేసింది.
ఆ అమ్మడు ఎవరో తెలుసా.. ? తనే యంగ్ హీరోయిన్ శివాని రాజశేఖర్. ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది.
హీరో రాజశేఖర్, జీవిత దంపతుల కూతురు శివాని. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.
2021లో అద్భుతం అనే సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. అందుకు ముందు శ్రీలీల, రోషన్ కలిసి నటించి పెళ్లి సందడిలో మెరిసింది.
ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ జనాలకు దగ్గరయ్యింది. అయితే శివాని ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను కెరీర్ ప్రారంభంలోనే మిస్సైందట.
అదే ఉప్పెన సినిమా. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమా అవకాశం ముందుగా శివానికి రాగా ఆ ఛాన్స్ వదులుకుందట.
తనకు వచ్చినప్పుడు కథ చాలా బోల్డ్ గా ఉందని.. లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉందని.. అప్పట్లో అలాంటి సీన్స్ చేయడానికి కంఫర్ట్‌గా లేనని చెప్పుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్