30 August 2024

రొమాన్స్ కాదు అలాంటి చిత్రాలే చేస్తానంటున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు షాలినిపాండే. తనదైన అద్భుత నటనతో సినీప్రియులను కట్టిపడేసింది. 

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

ఆ తర్వాత మెయిన్ కాకుండా సైడ్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేసింది. తెలుగులో మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా కనిపించింది.

తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఇటీవలే జయేష్ భాయ్ జోర్దార్ చిత్రంలో నటించి మార్కులు కొట్టేసింది.

ఇక ఇటీవల మహారాజ్ సినిమాలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఈ బ్యూటీకి సరైన ఆఫర్స్ మాత్రం రావట్లేదు. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను తదుపరి యాక్షన్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నానని.. శారీరకంగా ఫిట్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది. 

మహారాజ్ సినిమాలో డాన్స్ చేశాను. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, వాలీబాల్‏లోనూ రాణిస్తాను. నాకు శారీరక శ్రమ బాగా అలవాటు. అందుకే యాక్షన్.

ఇప్పుడు నేను శారీరకంగా ఫిట్ గా ఉన్నాను. అందుకే యాక్షన్ సినిమాలు చేస్తాను అని తెలిపింది. తనకు యాక్షన్ క్వీన్ కావాలను ఉందని తెలిపింది.