TV9 Telugu

22 January 2024

పాపం షకీలా‌.! కూతురు దాడితో పోలీసులను ఆశ్రయించిన నటి.

శృంగార తారగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు షకీలా.

ఆమె తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో చాలా సినిమాల్లో నటించి మెప్పించారు.

ప్రస్తుతం సినిమాలకు దూరం ఉంటున్న షకీలా ఇటీవలే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే షకీలా పై దాడి జరిగిందని తెలుస్తోంది. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

షకీలా పై దాడి చేసింది మరెవరో కాదు.. ఆమె పెంచుకుంటున్న కూతురు శీతల్.

పెంచుకున్న కూతురే తన పై దాడి చేయడంతో షకీలా ఆమె పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతే కాదు గొడవ సమయంలో అక్కడే ఉన్న లేడీ లాయర్ పై శీతల్ ఆమె తల్లి అసభ్యకరంగా మాట్లాడారని తెలిపారు షకీలా. 

అదే పోలీస్ స్టేషన్ లో శీతల్ కూడా షకీలా పై ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా చేస్తున్నారు.