కొందరి సలహాల వల్లే అలా చెయ్యాల్సి వచ్చింది అంటున్న సారా అలీ ఖాన్.

Anil Kumar

27 June 2024

సారా అలీ ఖాన్.. అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల నట వారసురాలిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది ఈ అమ్మడు.

ప్రత్యేకమైన నటనతోనే కాదు.. మంచి మనసున్న అమ్మాయిగా అందరి మన్ననలు పొందుతుంది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్.

తక్కువ సమయంలోనే తన కెరీర్‌లో చాలా పేరు సంపాదించుకున్న సారా.. ఇప్పుడు వరస అవకాశాలతో బిజీగా గడిపేస్తుంది.

ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం 'లవ్‌ ఆజ్‌కల్‌'.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

దీనిపై స్పందిస్తూ.. పరాజయాలు, ఓటములు ఒక్కోసారి మనకి మంచి పాఠాలు నేర్పుతాయని అంటున్నారు నటి సారా అలీ ఖాన్‌.

లవ్‌ ఆజ్‌కల్‌ తాను ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోయిందని.. కాస్త నిరాశపడ్డానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

కొన్ని రకాల ఒత్తిళ్లు, పరిస్థితులు., కొందరి సలహాలతో తాను ఆ పాత్రను ఒప్పుకోవాల్సి వచ్చిందని అన్నారు సారా.

మనసుకు నచ్చిందే చేయాలి, ఎవరి మాటా వినకూడదని అప్పటి నుంచే నిర్ణయించుకున్నట్టు చెప్పారు సారా అలీ ఖాన్.