సింధూరం మూవీ హీరోయిన్ 'సంఘవి' ఇప్పుడు ఎంతలా మారిపోయింది ఏంటి.!
Anil Kumar
13 June 2024
తెలుగు సినీపరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ట్రేండింగ్ హీరోయిన్లలో హీరోయిన్ "సంఘవి" కూడా ఒకరు.
దాదాపు 20 ఏళ్ళు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అలరించి., సౌత్ లోనే కాక, నార్త్ లోనూ దాదాపు 100 చిత్రాల్లో నటించారు.
తాజ్ మహల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి సంఘవి.. అందం, సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇంకేముంది.. ఈ మూవీ తర్వాత వరస అవకాశాలతో దూసుకుపోతూ టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో మెప్పించింది ఈమె.
కర్ణాటక మైసూర్ ప్రాంతానికి చెందిన నటి సంఘవి.. 1993-2004 మధ్యకాలంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.
దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అంతేకాదు.. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం సినిమా కలిసొచ్చింది.
ఈ మూవీకి నంది అవార్డ్ అందుకున్నారు. తెలుగుతోపాటు.. ఇతర బాషల్లోను ఆమెకు అప్పట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉండేది.
ఇక అవకాశాలు తగ్గడంతో 2016లో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైయ్యారు. త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి