TV9 Telugu
22 December 2023
మళ్లీ పెళ్లా.? అదొక.. అంటూ సమంత రియాక్షన్.!
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయారు.
మరోవైపు అనారోగ్య సమస్యలతోనూ చాలా ఇబ్బంది పడ్డారు. విదేశాలలో చికిత్స తర్వాత కోలుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్ కు..
తాజాగా ఓ నెటిజన్ నుంచి రెండో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది.
వీకెండ్ సందర్భంగా ఆస్క్ మీ అంటూ సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు.
ఈ క్రమంలో.. మీరు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ? అంటూ ఓ అభిమానినుంచి ఎదురైన ప్రశ్నకు..
సామ్ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. 2023 లో విడాకుల వివరాలను కోట్ చేస్తూ.. రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్ మెంట్ అని చెప్పారు.
కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అంటూ సమంత ఓ ఇమేజ్ తో అభిమానికి జవాబిచ్చారు.
మరో అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా.. తనకు దేవుడిపై నమ్మకం ఉందని సామ్ తెలిపారు.
అంతేకాదు.. మీ రోజువారీ దినచర్యలోనే మీ విజయ రహస్యం దాగి ఉంటుంది అంటూ కోట్ చేసారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి