24 November 2023

తల్లి కాబోతున్న సమంత..?

సినిమాలే కాదు.. సేవా కార్యక్రమాల్లో కూడా కాస్త ముందు వరుసలో ఉంటారు సమంత.. 

ప్రత్యూష స్వచ్చంద సహాయంతో.. ఎప్పటి నుంచో చాలా మంది చిన్నారులకు సాయం చేస్తున్నారు.

11 సంవత్సారలుగా ఈ సంస్థ తరుపున చిన్నారులకు అండగా ఉంటూ వస్తున్నారు. 

ఇక ఈక్రమంలోనే తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారట సామ్..

ప్రత్యూష పౌండేషన్‌ తరుపున ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారట సమంత. 

వారి ఆలనా పాలనతో పాటు.. వారు పెరిగి పెద్దయ్యే వరకు తనే చూసుకోవాలని అనుకుంటున్నారట. 

అయితే ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సమంత మంచి మనసు ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేస్తోంది.