సమంత అందం, ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. ఏమేం తింటుందో తెలుసా?

15 August 2025

Basha Shek

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే శుభం సినిమాతో ఆడియెన్స్ ను పలకరించింది. అలాగే నిర్మాతగానూ మొదటి హిట్ కూడా సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తోన్న సామ్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన హెల్త్, డైట్, ఫిట్ నెస్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది.

తాజాగా ట్వీక్ ఇండియాతో ముచ్చటించిన సామ్.. తన డైలీ రొటీన్ తో పాటు తన బ్యూటీ, స్కిన్ కేర్ టిప్స్ ను షేర్ చేసుకుంది. ఫిట్ నెస్ సీక్రెట్ ను కూడా పంచుకుంది

జర్నల్ రాయడం, మెడిటేషన్ చేయడం, సన్ లైట్ లో తిరగడంతో రోజును ప్రారంభించే సామ్ మార్నింగ్ బ్లాక్ కాఫీతో పాటు స్మూతీస్ కూడా తీసుకుంటుందట.

ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే బెర్రీస్ ను తీసుకునే సామ్ బ్రేక్ ఫాస్ట్ లోకి దోశ, ఇడ్లీ, సాంబార్, కొబ్బరి చట్నీ ప్రిఫర్ చేస్తుందట

ఇక తనకు పికిల్స్ అంటే చాలా ఇష్టమున్నప్పటికీ  చాలా రోజుల నుంచి వాటికి దూరంగా ఉంటోందట సమంత. అలాగే బోండా (ఆలూ బోండా కాదు) కూడా తీసుకుంటుందట

ఇక వర్కవుట్ విషయానికి వస్తే.. ఎక్కువగా పవర్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తుందట. అలాగే పిలెట్స్, యోగా, ధ్యానం కూడా తన డైలీ లైఫ్ లో భాగమంటోంది

ఇక పుస్తకాలు చదవడం కూడా తన దిన చర్యలో ఉందన్న సామ్ ప్రస్తుతం అన్ బౌండ్: ఏ వుమన్స్ గైడ్ టు పవర్ అనే బుక్ ను చదువుతోందట.