TV9 Telugu

అందుకే నా వ్యాధి గురించి బయటపెట్టా: సమంత

18 March 2024

టాలీవుడ్‌ టూ బాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ సమంత ఇండస్ట్రీలోకి వచ్చి ఇంచుమించు 14 ఏళ్లు పూర్తిచేసుకున్నారు.

తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన సామ్ అనారోగ్యం వల్ల నటనలో గ్యాప్ తీసుకుని మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు.

తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న సమంత.. తన హెల్త్ , సినిమాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను 14 ఏళ్ల సినీ కెరీర్‌లో తన శరీరానికి, మనసుకు ఎలాంటి బ్రేక్‌ ఇవ్వలేదని అలుపెరగని పోరాటం చేశానని వివరించారు.

ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌ కారణంగా కెరీర్‌ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్‌ చేయలేకపోయానన్నారు హీరోయిన్ సమంత.

విజయం సాధించినప్పటికి అది తన వల్ల వచ్చింది కాదని.. వేరేవారి వల్ల వచ్చిందని భావించేదాన్నని సమంత తెలిపారు.

మయోసైటిస్‌ కారణంగా గతంలో తాను నటించిన యశోద ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటంతో ఆ టైంలో చాలా రూమర్స్ వచ్చాయని..

అవన్నీ తట్టుకోలేకపోయానని తెలిపిన సామ్.. తప్పనిసరి పరిస్థితుల్లో తన వ్యాధి గురించి బయటపెట్టాల్సి వచ్చిందని వివరించారు.