కుటుంబసభ్యులు వద్దన్నా నేను వినకుండా ఆ  సినిమాలో నటించా : సమంత 

Rajeev 

07 June 2024

మయోసిటిస్ కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. 

చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ గ్లామరస్ హీరోయిన్. 

సామ్ కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు చేసింది. తమిళ్ , తెలుగుతో పాటు ఇప్పుడు హిందీ పైన ద్రుష్టి పెట్టింది . 

ఇక నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడటం, ఆతర్వాత విడాకులు తీసుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. 

ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది.

పుష్ప సినిమాలో ఊ అంటావా మామ పాటకు డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది సామ్. 

పుష్పలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినప్పుడు, ఆ పాట చెయ్యొద్దని కుటుంబ సభ్యులు, స్నేహితులు సలహా ఇచ్చారని సమంత తెలిపింది.