సాయి పల్లవి గ్రేట్.. గ్యాప్ వచ్చిన క్రేజ్ తగ్గలేదు.. ఛాన్స్ లు తగ్గలేదు

Rajeev 

11 June 2024

 నేచురల్ స్టార్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ సాయి పల్లవి. ఫిదా సినిమాతో అడుగు పెట్టింది ఏ చిన్నది. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సాయి పల్లవి , తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. 

నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఈ  చిన్నది. 

అందాల ఆరబోతకు నో  చెప్తూ కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న పల్లవికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 

2020లో ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక నటి సాయి పల్లవి.

‘గార్గి’ సినిమా తరువాత సాయి పల్లవి సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించింది.

ఈ మధ్యనే తిరిగి సినిమాలు చేస్తుంది. తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ లో రామాయణం సినిమా చేస్తుంది.