సదా అందుకే పెళ్లి చేసుకోలేదట !!
హీరో సదా తేజ దర్శకత్వంలో నితిన్ సరసన జయం అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
మొదటి చిత్రంతోనే గుర్తింపు రావడం అనేది చాలా కష్టం. అలా గుర్తింపు లభించిన వాళ్ళని అదృష్టవంతులు అనవచ్చు.
అలాంటి వారిలో హీరోయిన్ సదా ఒకరు.
జయం సినిమాలో సదా చెప్పిన వెళ్ళవయ్యా బాబు వెళ్ళు” అంటూ పాపులర్ అయిన డైలాగ్ నేటికి అమ్మాయిలు ఉపయోగిస్తున్నారు.
ఇప్పటికీ కూడా సదాని గుర్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ డైలాగ్ ని ఇమిటేట్ చేస్తారు. అంత పాపులర్ అయింది ఈ డైలాగ్.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పింది.
తాను పెళ్ళి చేసుకో లేదు కాబట్టే సంతోషంగా ఉన్నానని, పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ మొత్తం పోతుందని, ఆమె చెప్పింది.
సదా కి వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టమట. అడవి జంతువులన్నా ఇష్టమట.
తనకు ఖాళీ దొరికినప్పుడల్లా అడవికి వెళ్లి జంతువులతో కాలక్షేపం చేస్తూ ఉంటుందట.
ఇక్కడ క్లిక్ చేయండి