21 September 2023

ఆ సీన్ చేశాక.. ఇంటికెళ్లి చాలా సేపు ఏడ్చా :  సదా.

సదా..! ఇప్పట్లో.. టీవీ షోల్లో జడ్జిగా కనిపిస్తున్నారే కానీ..  అప్పట్లో.. యూత్‌కు నిద్రలేకండా చేసే వారు.

తన లుక్స్‌తో.. అటు  పదహారణాల తెలుగు పాపగా.. ఇటు మోడ్రన్ నోకియాగా.. అందర్నీ తెగ ఆకట్టుకునేవారు.

అయితే 'జయం'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన  సదా.. ఆ సినిమాలోని ఓ సీన్‌ తనను ఎంతగానో ఏడ్చేలా చేసిందని తాజాగా చెప్పారు. 

జయం సినిమాలోని గోపీచంద్ తన బుగ్గను నాకే సీన్ చూస్తుంటే.. ఇప్పటికీ బాధపడుతుంటానని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

మొదట డైరెక్టర్ తేజ చెప్పినప్పుడు ఆ సీన్‌ చేయనని చెప్పారట సదా.. కానీ ఆ సీన్‌ మూవీకే హైలెట్‌గా నిలుస్తుందని చెప్పండంతో ఓకే చెప్పారట.

ఇక ఆ సీన్‌ చేశాక.. ఇంటికెళ్లి చాలా సేపు ఏడ్చారట సదా..! ఏడవడమే కాదు పదే పదే ముఖాన్ని కడుకున్నారట కూడా..

ఇక అప్పటి నుంచి ఆ సినిమా వచ్చినా కూడా.. ఆ సీన్‌ ముందు అక్కడి నుంచి వెళ్లిపోతారట. 

అయితే జయం రీ- రిలీజ్ చేయాలంటూ.. నితిన్ ఫ్యాన్స్ డిమాడ్ చేస్తున్న వేళ.. సదా మాటలు ఇప్పుడు ఈ సినిమా పైపే అందరూ చూసేలా చేస్తున్నాయి.