అందంలో చంద్రునికే పోటీ ఈ ముద్దుగుమ్మ.. రీతూ మెస్మేరైజ్ లుక్స్..
Battula Prudvi
14 October 2024
10 మార్చి 1990న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది అందాల తార రీతూ వర్మ. ఈమె తండ్రి మధ్యప్రదేశ్‌కు చెందినవారు.
హైదరాబాద్‌లోని విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి భామ.
తర్వాత హైదరాబాద్‌లో మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది ఈ బ్యూటీ.
2013లో ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో కాజల్ చెల్లెలి పాత్రలో తొలిసారిగా వెండితెరపై కనిపించింది ఈ వయ్యారి.
తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, నాని ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాల్లో నటించింది ఈ అందాల భామ.
2016లో విజయ్ దేవరకొండకి జోడిగా పెళ్లి చూపులు చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రెండు ఉత్తమ నటి అవార్డ్స్ పొందింది.
తర్వాత కేశవ, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, వరుడు కావలెను, ఓకే ఒక జీవితం వంటి చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ వయ్యారి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి