గుడ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్

16 October 2024

Basha Shek

 ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యన సామాజిక కార్యక్రమాలతో బాగా వార్తల్లో నిలుస్తున్నారామె.

మూగజీవాలంటే అమితమైన ప్రేమాభిమానాలు చూపించే రేణు వాటి సంక్షేమం కోసం నిధులు సేకరిస్తోంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్‌ ఎప్పటికప్పుడు సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు

కాగా గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటించింది రేణు దేశాయ్.

అయితే భారీ అంచనాలతో రిలీజైన ఈ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేకపోయింది.

దీని తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు రేణు దేశాయ్‌. అయితే ఇప్పుడు మరో సినిమాకు పచ్చజెండా ఊపిందీ అందాల తర.

షూటింగ్‌లో పాల్గొనడం కోసం. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నాను'' అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది రేణు దేశాయ్.

ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే తాను ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం వెల్లడించలేదు రేణు