TV9 Telugu
అదే నా బ్యూటీ సీక్రెట్.. అందం కోసం రష్మిక ఆ పని చేస్తుందట..
13 March 2024
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వయ్యారి భామ రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది .
తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ అమ్మడు మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో కలిసి నటించింది.
మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ తో కలిసి పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా చేసింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
ఇక తమిళ్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. దళపతి విజయ్ కు జోడీగా వారసుడు సినిమాలో నటించింది.
అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు మూడు భాషల్లో బిజీగా మారిపోయింది రష్మిక మందన్న.
రష్మిక మందన్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రాకరకాలఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
రష్మిక అందాన్ని చూస్తే ఫిదా కానీ కుర్రాడు ఉండడు. అయితే ఈ అమ్మడు అందం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
కాస్మోటిక్ ప్రొడక్ట్స్ తో పాటు స్కిన్‌కేర్ రొటీన్ ఫాలో అవుతుందట. రోజంతా వాటర్ కొంచెం కొంచెంగా తాగుతూనే ఉంటానని ఆమె చెప్పింది.
రష్మిక హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్‌కు ఎక్కువగా వాడుతానని తెలిపింది. ఇవే ఈ అమ్మడి బ్యూటీ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి