ఓ రేంజ్ లో రష్మిక మందన్న ఆస్తులు.. మొత్తం ఎంతంటే ??

TV9 Telugu

06 April 2024

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు తెలుగు ఆడియెన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

టాలీవుడ్ చేస్తుంటే మరోవైపు  ఇతర భాషల్లోనూ చేస్తూ తన నటనతో అక్కడ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటోంది.

కన్నడ చిత్రాలతో నటిగా ఎదిగిన రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దుమ్ములేపుతోంది. ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ అలరిస్తోంది. 

రీసెంట్ గానే  ఈ ముద్దుగుమ్మ ‘యానిమల్’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. నెక్ట్స్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప2 ది రూల్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఈ క్రమంలో తాజాగా రష్మిక మందన్న ఇన్నేళ్లలో సంపాదించిన ఆస్తులు, నెట్ వర్త్ గురించి న్యూస్ వైరల్ గా మారింది. 

కొన్ని నివేదికల ప్రకారం బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన బంగ్లా, ముంబైలో గ్రాండ్ అపార్ట్‌మెంట్ ఉంది. గోవా, కూర్గ్, హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఆస్తులను కలిగి ఉంది.

అలాగే రూ.40 నుంచి 60 లక్షల విలువ గల ఆడి క్యూ3 కారును కలిగి ఉంది. రేంజ్ రోవర్ స్పోర్ట్‌ కారు కూడా ఉంది. దీని ధర రూ. 1.6 కోట్లు.

రూ.62 లక్షలు గల Mercedes-Benz C క్లాస్ కూడా ఉంది.  ఇలా మొత్తం ఆమె నెట్ వర్త్ రూ. 45 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది.