TV9 Telugu
పార్టీ కావాలి.! విజయ్ దేవరకొండకు రష్మిక కండిషన్.
30 March 2024
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ఫ్యామిలీస్టార్. ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ 5న ఫ్యామిలీస్టార్ విడుదల కానుంది. గీత గోవిందం తరువాత విజయ్, పరశురామ్ కలిసి చేస్తున్న సినిమా ఇది.
తాజాగా విడుదలైన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌కి నెట్టింట మంచి స్పందన వస్తోంది. రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు నేషనల్ క్రష్ అయినా రష్మిక మందన్న ఫ్యామిలీస్టార్ ట్రైలర్ పై తనదైన మార్క్ తో రెస్పాండ్ అయ్యారు.
విజయ్ దేవరకొండ , మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీస్టార్ కి ఘన విజయం దక్కాలని ఆకాంక్షించారు నటి రష్మిక మందన్న.
” నా డార్లింగ్స్ విజయ్ దేవరకొండ, పరశురామ్" లకు శుభాకాంక్షలు. ఈ సినిమాపై నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.
విజయ్, పరశురామ్ మరోసారి తప్పకుండా హిట్ కొడతారని, పార్టీ కావాలని పోస్ట్ పెట్టారు నేషనల్ క్రష్ రష్మిక.
మై లవ్ మృణాల్ ఆల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేసారు. రష్మిక ట్వీట్ కు విజయ్ క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి