మీరెక్కడ దొరికార్రా బాబు..! పెళ్ళైనోడిని పెళ్లి చేసుకోమంటున్నారు 

Rajeev 

30  March 2024

అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా తన వయ్యారంతో నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. 

యంగ్ హీరోలందరితో సినిమాలు చేసిన రాశి ఖన్నా.. చాలా కాలంగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. 

రాశి ఖన్నాకు సక్సెస్ లేకపోయినా ఆఫర్స్ మాత్రం తక్కువ కాదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ చిన్నది.

తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ అందుకుంటుంది రాశి ఖన్నా.. కానీ హిట్ మాత్రం కొట్టడం లేదు.

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి తెలుగులో అవకాశాలే కరువైయ్యాయి. ఎప్పుడో ఒకసారి తప్పితే పెద్దగా సినిమాలు రావడం లేదు.

బాలీవుడ్ లో యోధ సినిమాలో సిద్దార్థ్‌ మల్హోత్రా సరసన అదరగొట్టింది. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ జంటను చూసి అభిమానులు సిద్దార్థ్‌.. కియారాకు బదులుగా రాశీని పెళ్లి చేసుకుంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.

అది కేవలం వారి అభిప్రాయం మాత్రమే.. మేము కలిసుంటే బాగుండని అనుకుంటుంటారు అంతే అంటూ ఈజీగా తీసుకుంది రాశి.